జడ్పీ చైర్ పర్సన్ గుజ్జ దీపిక యుగేంధర్ రావుకు ఘన సన్మానం
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): సూర్యాపేట జడ్పీ చైర్ పర్సన్ గా నాలుగేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న గుజ్జ దీపిక యుగేంధర్ రావును బుధవారం జడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణ పంచాయతీ రాజ్ నాలుగోవ తరగతి ఉద్యోగుల సంఘం, జిల్లా పరిషత్ కార్యాలయ సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హత ఉన్న అటెండర్లకు రికార్డు అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించనున్నట్లు తెలిపారు. ఇటీవల కారుణ్య నియామకం కింద పది మందిని అటెండర్లుగా నియమించినట్లు చెప్పారు.పంచాయతీ రాజ్ నాలుగోవ తరగతి ఉద్యోగులకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ జి.సురేష్ , నేరేడుచర్ల జెడ్పిటీసి సభ్యులు రాపోలు నర్సయ్య, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అద్యక్షులు బొల్లెంపల్లి నాగయ్య, జిల్లా కార్యదర్శి శ్రీను, జిల్లా పరిషత్ కార్యాలయ పర్యవేక్షకులు శ్రీనివాస చారి, మదన్ మోహన్ రెడ్డి, విజయకుమారి,జిల్లా పరిషత్ కార్యాలయ సిబ్బంది, నాల్గవ తరగతి సంఘం కోశాధికారి లింగయ్య , మహిళా అధ్యక్షురాలు మహిబూబా, మహిళా ప్రధాన కార్యదర్శి జ్యోతి, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.