జనం సాక్షి ప్రతినిధి మెదక్ ఈ రోజు జిల్లా యెస్.పి శ్రీమతి పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.యెస్ గారి ఆద్వర్యంలో జిల్లా పోలీసు ప్రాదాన కార్యాలయంలో శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా “జాతీయ ఐక్యత దినోత్సవం” కార్యక్రమాన్ని ఏక్తా దివస్ ప్రతిజ్ఞ నిర్వహించి, మానవీయమూర్తి సర్దార్ వల్లభాయి పటేల్ గారికి ఘన నివాళి అర్పించి పోలీసు సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించినారు.
ఈ సందర్భంగా జిల్లా యెస్.పి శ్రీమతి పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.యెస్ గారు మాట్లాడుతూ… సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది పోరాటమే ఊపిరిగా సాగిన ప్రస్థానం దేశ సమగ్రత కోసం శ్రమించిన ధీరత్వం, అప్పుడే స్వతంత్రం వచ్చిన పసిగుడ్డు లాంటి దేశాన్ని ఒంటి చేత్తో ఏకం చేసి, దేశ విభజనతో జాతి గుండెకు గాయమైన వందలాది సంస్థలను ఒక్కటి చేసిన మహనీయుడికి ఘననివాళి. యావత్ భారతావనిలోని ప్రజలందరూ ఒకే కుటుంబంలో జీవిస్తూ జాతి సమైక్యతకు పునరంకితమై మాతృదేశానికి మన వంతు సేవ చేయడమే స్వాతంత్ర సమరయోధులకు నిజమైన నివాళి అవుతుందని కొనియాడారు. జిల్లా పరిదిలో అన్ని పోలీస్ స్టేషన్లలో సర్దార్ వల్లభాయి పటేల్ గారి జయంతిని పురస్కరించుకొని ఏక్తా దివస్ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించి మానవీయ మూర్తి సర్దార్ వల్లభాయి పటేల్ గారికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో యెస్.బి సి.ఐ శ్రీ.నవీన్ బాబు, షి టీం, భరోసా మహిళా ఎస్.ఐ కుమారి నాగరాణి గారు, కమ్యూనికేషన్ ఎస్.ఐ శ్రీ.యన్.వెంకటేష్ గారు, మరియు జిల్లా పోలీసు ప్రదాన కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
జనం సాక్షి ప్రతినిధి మెదక్ ఈ రోజు జిల్లా యెస్.పి శ్రీమతి పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.యెస్ గారి ఆద్వర్యంలో జిల్లా




