*జనజీవన స్రవంతిలో కలవాలి. *డిఎస్పి రాములు .

చిట్యాల 7(జనం సాక్షి) జన జీవన స్రవంతిలో కలవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా డిఎస్పి రాములు అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని  చల్లగరిగ గ్రామానికి చెందిన మావోయిస్టు నేత సుధాకర్ తల్లిని కలిసి, డీఎస్పీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమెకు 25కిలోల బియ్యంతో పాటు నిత్యవసర వస్తువులు సుమారు ఐదువేల విలువ గలవి అందజేశారు.అనంతరం ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ మావోయిస్టు పార్టీ నుండి విడనాడి, జనజీవన స్రవంతిలో కలిస్తే రివార్డు అయిదు లక్షలతో పాటు దళిత బంధు 10 లక్షలు అందజేస్తామన్నారు. డీఎస్పీ వెంట చిట్యాల సిఐ వెంకట్, ఎస్సైలు కృష్ణ ప్రసాద్. శాకాహాన్, సర్పంచ్ తదితరులు ఉన్నారు.