9న వాల్మీకి జయంతి సందర్భంగా టాక్టర్స్ రివర్స్ గేర్ పోటీలు

మల్దకల్ అక్టోబర్ 7 (జనంసాక్షి) మండల కేంద్రంలోని వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా మల్దకల్ ట్రాక్టర్స్ డ్రైవర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ట్రాక్టర్ రివర్స్ గేర్ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఇట్టి పోటీలలో ఆసక్తిగల వారు మల్దకల్ డ్రైవర్స్ కు సంప్రదించాలని కోరారు.మొదటి బహుమతి 1016,రెండవ బహుమతి 5016,మూడు బహుమతి 3,016, ఇట్టి బహుమతుల దాత మల్దకల్ ప్రాథమిక పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ సిద్ధి నరసింహులు ప్రకటించారు.ఈనెల 9వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల లోపు 200 రూపాయలు చెల్లించి పేర్లు నమోదు చేసుకోగలరని నిర్వాహకులు తెలిపారు.ఈ పోటీలు ఉదయం 10:30 గంటలకు ప్రారంభించబడుతాయి. వివరాలకు నెంబర్లు 99666043315,630142609 సంప్రదించాలని వారు కోరారు.