Thursday, 5 November 2026

జనవరి 19న హైదరాబాద్‌లో మహాధర్నా

సీపీఐ ఎమ్మెల్యే గుండా మల్లేష్‌
నిజామాబాద్‌: కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ విషయంలో ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 19న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు సీపీఐ ఎమ్మెల్యే గుండా మల్లేష్‌ తెలిపారు. ఆయన ఈరోజు ఆర్‌ అండ్‌ బీ అతిధిగృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతనెల 22న జరిగిన అఖిలపక్ష సమావేశంలో రెండు పార్టీలు మిగిలినవన్నీ తెలంగాణపై తమ అభిప్రాయాన్ని చెప్పాయన్నారు. అయినప్పటికి కేంద్ర ప్రభుత్వం తన వైఖరి వెల్లడించకుండా తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందన్నారు. అందుకే ఈ నెల మహాధర్నాకు అన్ని పార్టీల నాయకులను ఆహ్వానించి ఏకాభిప్రాయం కోసం పాటుపడతామని తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్లుతెరచి రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయకపోతే ప్రత్యక్ష పోరాటాలు తప్పవని ఆయన హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *