Wednesday, 4 November 2026

జనసేనలోకి చిరు అభిమానులు

హైదరాబాద్‌,జూలై9(జ‌నం సాక్షి): చిరంజీవి అభిమాన సంఘాల నాయకులు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌.. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జనసేన తీర్థం పుచ్చుకున్న వారిలో అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు స్వామి నాయుడు, ఏపీ చిరంజీవి యువత అధ్యక్షుడు కటకం రామకృష్ణ, తెలంగాణ అధ్యక్షుడు నందకిశోర్‌, కర్ణాటక చిరంజీవి యువత అధ్యక్షుడు, అభిమానులు ఉన్నారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక నుంచి వచ్చిన మెగస్టార్‌ చిరంజీవి అభిమానులందరికీ జనసేన తరఫున పవన్‌ స్వాగతం పలికారు.