జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం.

బెల్లంపల్లి, అక్టోబర్18,(జనంసాక్షి)
బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా లో మంగళవారం జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం చేపట్టారు.
ఈసందర్భంగా జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్ మాట్లాడుతూ అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పదని ఆకలి తో ఉన్నవారి ఆకలి తీర్చడం సంతోషంగా ఉందని దాతల సహకారంతో జనహిత అన్నపూర్ణ అన్నదాన కార్యక్రమం ఉగాది సందర్భంగా ఏప్రిల్ 13 వ తేదీ 2021 న ప్రారంబించడం జరిగిందన్నారు. దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. దాతల కోరిక మేరకు ఈ రోజు 132 వ సారి అన్నదాన కార్యక్రమం దాత మద్దెల లక్ష్మి రాజనర్సు జ్ఞాపకార్థం వారి కుటుంబం సభ్యుల ఆధ్వర్యంలో యాచకులకి, నిరుపేదలు, కూలీలు, చిరువ్యాపారులు, బాటసారులకి ఒక పూట ఆకలి తీర్చేందుకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం లో సుమారు 180 మందికి అన్నదానం చేయడం జరిగిందని ఈ జనహిత అన్నపూర్ణ అన్నదాన కార్యక్రమం విజయవంతం కొరకు మరింత మంది దాతలు ముందుకు రావాలని అలాగే సహాయ సహకారాలు అందిస్తున్న దాతలందరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దాత కుటుంబ సభ్యులు మద్దెల గోపి, యాదగిరి, విజయ్, ఉమాకాంత్, హానీ, మిత్ర బృందం మురళి, చక్రి, సొత్కు శ్రీను, సమ్మయ్య, బానేశ్, జనహిత సేవా సమితి కోశాధికారి కోడిపెళ్లి గిరి ప్రసాద్, నిచ్చకోలా గురుస్వామి పాల్గొన్నారు.