Wednesday, 4 November 2026

జన చైతన్య యాత్ర ను స్వాగతం పల్కడానికి బయలు దేరిన జుక్కల్ సి పి ఎం నాయకులు.

జుక్కల్, మార్చి 24, (జనం సాక్షి),
సి పి ఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న జన చైతన్య యాత్ర శుక్రవారం నిజామాబాదు జిల్లా కేంద్రం నుండి బయలు దేరి కామారెడ్డి జిల్లా లో ప్రవేశిస్తున్నందుకు గాను ఈ యాత్ర కు కామారెడ్డి జిల్లా గాంధారి చౌరస్తా వద్ద ఘనస్వాగతం పలికెందుకు గాను జుక్కల్ నుండి సి పి ఎం పార్టీ జిల్లా కమిటి సభ్యుడు సురేష్ గొండ ఆధ్వర్యంలో 50మంది తో బైక్ ల పై ర్యాలీ గా బయలు దేరి వెళ్లారు. ర్యాలీ ప్రారంభనికి ముందు జుక్కల్, బిచ్కుంద మండల కేంద్రాల్లోని అంబేద్కర్ విగ్రహలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బిచ్కుంద, బాన్స్ వాడ, గాంధారి మీదుగా చౌరస్తా వరకు ర్యాలీ గా వెళ్లి జన చైతన్య యాత్ర కు స్వాగతం పలుకనున్నట్లు సురేష్ గొండ తెలిపారు. కార్యక్రమం లో బి. ఆడేప్ప, సంజీవ్, బాబు, మోతిరం నాయక్,కోలా నారాయణ, సాయిలు, సచిన్, శంకర్, మహిబూబ్ సబ్, మారుతీ,మల్లు గొండ తదితరులు పాల్గొన్నారు.