Thursday, 5 November 2026

జన చైతన్య యాత్ర వాల్ పోస్టర్ ఆవిష్కరణ

పెనుబల్లి, మార్చ్ 17(జనం సాక్షి)
సిపిఎం జన చైతన్య యాత్ర వాల్ పోస్టర్ల ను శుక్రవారం పెనుబల్లి చలమాల సూర్యనారాయణ భవనంలో గాయం తిరుపతిరావు అధ్యక్షతన ఆవిష్కరిం చారు, ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు చలమాల విట్టల్ రావు మాట్లాడుతూ బిజెపి మతోన్మాద కార్పొరేట్ విధానాలను వ్యతిరేకించాలని, మార్చి 17 నుంచి 29 వరకు సిపిఎం పార్టీ అఖిలభారత కమిటీ పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో జన చైతన్య యాత్రలు జరుగుతున్నాయని అన్నారు, ప్రజలు ప్రజాస్వామ్యవాదులు లౌకికవాదులు మేధావులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు, మోడీ అమిత్ షా ల నేతృత్వంలో కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్లు కట్టబెడు తున్నా రని, ప్రజలపై భారాలను మోపుతూ 23 కోట్ల మందిని నిరుపేదలుగా చేశార ని, దేశం అంటే అంబానీ ఆదాని సొత్తుగా మార్చేశార న్నారు, నూనెలు వంటగ్యాస్ పెట్రోలు డీజిల్ తో సహా అన్ని సరుకులు ధరలు రెండు మూడు రేట్లు పెంచారని విమర్శించారు, 2014లో 410 ఉన్న గ్యాస్ బండ నేడు 1150 రూపాయలకు పెరిగింద ని,ఈ ధరలు పెరుగుదల వల్ల కార్పొరేట్ శక్తులు వేలకోట్ల రూపాయలు లాభాలను పోగేసుకుంటున్నారని అన్నారు, లక్షల కోట్లు ఖర్చుపెట్టి బలోపేతం చేసిన ప్రభుత్వ రంగాన్ని కార్పొరేట్లకు అమ్మేస్తున్నారని అన్నారు, ఈనెల 21వ తారీఖున తల్లాడ సెంటర్లో జరిగే బహిరంగ సభను ప్రజలు వేలాదిగా వచ్చి బహిరంగ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నామని అన్నారు, ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు చలమాల నరసింహారావు, గుడిమెట్ల బాబు, నల్లమల అరుణ ప్రతాప్, సింగిసేల ప్రసాద్ ,మేకల బాజీ, చీపు వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు, ఎం ప్రసాదు, శివ, మిద్దె కృష్ణ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.