హైదరాబాద్,(జనంసాక్షి): ప్రొఫెసర్ జయశంకర్ కలలు కన్న ప్రత్యేక రాష్ట్ర సాధనలో నాలుగున్నర కోట్ల ప్రజల కదిలిఆవాలని టీఆర్‌ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. తక్షణమే ట్యాంక్‌బండ్‌పై జయశంకర్ సార్ విగ్రహం ఏర్పాటు చేయాలని టీఆర్‌ఎస్ డిమాండ్ చేసింది. జయశంకర్ సార్ రెండో వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సేలు ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. అవసరమైతే జయశంకఱ్ సార్ కాంస్య విగ్రహాన్ని తమ పార్టీ అందివ్వడానికి సిద్దంగా ఉందని తెలిపారు




