హైదరాబాద్,(జనంసాక్షి): తెలంగాణ జాతిపిత దివంగత ప్రొఫెసర్ జయశంకర్ సార్ రెండో వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి టీఆర్‌ఎస్ నేతలు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ నేత కె. కేశవరావు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే జయశంకర్ సార్‌కు ఘనమైన నివాళి అని చెప్పారు. ఆయన కలలు కన్న తెలంగాణ వచ్చి తీరుతది అని పేర్కొన్నారు. జయశంకర్ సాఱ్ ఆశయసాధనకు అనుగుణంగా ఉద్యమిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని కేకే ప్రారంభించారు.




