జర్నలిస్టుల విధులకు ఆటంకం కలిగించిన వారిపై చర్యలు తీసుకోవాలి

-పినపాక ప్రెస్ క్లబ్.
పినపాక, అక్టోబర్ 12(జనం సాక్షి):- విధి నిర్వహణలో భాగంగా అనేక ప్రదేశాలకు వెళ్లిన సమయాల్లో జర్నలిస్టుల విధులకు ఆటంకం కలిగిస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బుధవారం ఏడుళ్ళ బయ్యారం సిఐ రాజగోపాల్ కు పినపాక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం జరిగింది. పినపాక మండలంలో కొంతమంది ఇసుక ర్యాంప్ నిర్వాహకులు క్వారీల వద్ద ప్రైవేట్ వ్యక్తుల్ని ఏర్పాటు చేసుకొని అక్కడకు వెళ్లిన జర్నలిస్టుల విధులకు ఆటంకం కలిగిస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పినపాక ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు .