Tuesday, 3 November 2026

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి

– జిల్లా సహాయ కార్యదర్శి బేతమల్ల సహదేవ్
 కురవి (జనంసాక్షి):అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘంజిల్లా సహాయ కార్యదర్శి బేతమల్ల సహదేవ్ అన్నారు.గురువారం మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో  అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మండల కమిటీ ఆధ్వర్యంలో సీనియర్ అసిస్టెంట్ రెహమాన్ కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు తమ వంతు పాత్ర పోషించిన జర్నలిస్టుల సంక్షేమానికి ముఖ్యమంత్రి  కేసీఆర్ పలు సందర్భాల్లో అనేక హామీలు ఇచ్చారని అన్నారు.టిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో లో జర్నలిస్టుల సంక్షేమాన్ని పొందుపరచారని,హామీ ఇచ్చి ఆరు సంవత్సరాలు దాటినా నేటికీ హామీలు నెరవేరకపోవడంతో జర్నలిస్టులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. జర్నలిస్టులకు ప్రధాన డిమాండ్లు జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు కేటాయించి ఇల్లు నిర్మించాలి, ఇంటి కార్డులు మంజూరు చేసి అన్ని ప్రైవేట్ హాస్పిటల్ లో చెల్లుబాటు అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.239 జీవోను రద్దు చేసి అర్హులందరికీ అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలు పత్రికలకు చెందిన విలేకరులు బాలు,సత్యనారాయణ,రాజు, అంగడి నర్సయ్య రంజిత్ సంతోష్ పూర్ణ ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.