Monday, 2 November 2026

కలం సైనికుల పోరుబాట  

జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి

తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించిన జర్నలిస్టులు.

పాపన్నపేట జనం సాక్షి , మండల కేంద్రమైన పాపన్నపేట లోని గురువారం నాడు  టీయూడబ్ల్యూజే    ,ఐజెయూ పిలుపు మేరకు స్థానిక సుభాష్ చంద్రబోస్ విగ్రహం నుండి పాద యాత్రగా బయలు దేరి పాపన్నపేట తహసీల్దారు బలరాంకు వినతి పత్రం సమర్పించారు.ఈ సంధర్బంగా బీజేపీ,కాంగ్రెస్ నాయకులు సంగీభవం తెలిపారు.అనంతరం రాష్ట్ర దాడుల కమిటి అధ్యక్షులు మిన్పూర్ శ్రీనివాస్ మాట్లాడుతూ జర్నలిస్ట్ లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను  వెంటనే అమలు  చేయాలన్నారు.239జీవో నువెంటనే రద్దు చేసి అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్ లు ఇవ్వాలన్నారు.మెదక్ మాజీ ఎమ్మెల్యే పి.శశిధర్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్ట్ లకు తమ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందన్నారు.పాపన్నపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నవాత్   బాలకిషన్ మాట్లాడుతూ జర్నలిస్ట్ లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు.ఈకార్యక్రమంలో అధ్యక్ష,ప్రధాన కార్య దర్శులు ఏ. నర్సింలు, జర్నలిస్టులు పి.శ్రీనివాస్,బాల్రాజ్,సంగమేశ్వర్,ప్రసాద్,సుమన్,మధు,శ్యామ్,శివచరణ్,జగదీష్, మల్లేశం,స్వామి తదితరులు పాల్గొన్నారు.