జర్నలిస్టు శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శ.
తొర్రూరు 6 సెప్టెంబర్ (జనంసాక్షి )
సీవీఆర్ న్యూస్ రిపోర్టర్ గిరికత్తుల శ్రీనివాస్ గౌడ్ అమ్మ గిరికత్తుల బాలమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. సోమవారం పోతిరెడ్డిపల్లి గ్రామంలోని జర్నలిస్టు శ్రీనివాస్ గౌడ్ కుటుంబాన్ని తొర్రూరు జెడ్పిటిసి మంగళపల్లి శ్రీనివాస్, ఎస్సై గండ్రాతి సతీష్, బిజెపి రాష్ట్ర నాయకులు పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి పెదగాని సోమయ్య, టియుడబ్ల్యూజే(ఐజేయు)జాతీయ కౌన్సిల్ సభ్యులు దూలం శ్రీనివాస్ గౌడ్,ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు నాగపురి అశోక్ గౌడ్, ఎలక్ట్రానిక్ మీడియా 143 జిల్లా అధ్యక్షుడు జలగం శేఖర్ లతోపాటు తొర్రూరు జర్నలిస్టులు పాల్గొని మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీనివాస్ కుటుంబ సభ్యులను ఓదార్చారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు శ్రీమాన్,బొచ్చు సురేష్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ఉపాధ్యక్షులు, అండెం కృష్ణ, దేవరకొండ క్రిష్ణ ప్రసాద్, జర్నలిస్టులు యాదగిరి నాయక్, అంకం సురేష్, కొయ్యడ సాంబశివ,ఏకాంబరం, ఎనగందుల సంతోష్, నల్లపు రాజు, చిలకమారి భాస్కర్, శంకర్, బోగ సురేష్, సిరికొండ విక్రమ్, మహేష్,వీరాంజనేయులు, తండా సురేష్,టిఆర్ఎస్ నాయకులు రాయిశెట్టి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.