జర్నలిస్ట్ కుటుంబానికి ఎమ్మెల్యే రెడ్యా పరామర్శ
మరిపెడ, ఆగష్టు 05, ( జనం సాక్షి )
మండలంలోని అబ్బాయి పాలెం గ్రామానికి చెందిన
సీనియర్ పాత్రికేయులు జిన్న
లచ్చయ్య తండ్రి జిన్నా ఇద్దయ్య (90) శుక్రవారం మృతి చెందడంతో విషయం తెలుసుకున్న డోర్నకల్ శాసనసభ్యులు డీ ఎస్ రెడ్యానాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు తో కలసి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అయన వెంట తెరాస నాయకులు గుగులోతు రాంబాబు, ధర్మారం సర్పంచ్ ఆనంద్ ,ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, టీఆరెఎస్ యువ నాయకులు దూర పర్షురాములు , లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area