Wednesday, 4 November 2026

జర్నలిస్ట్ ల హెల్త్ కార్డుల పై కార్పొరేట్ ఆసుపత్రిలో ఉచిత వైద్యం అందించాలి.

జర్నలిస్ట్ ల హెల్త్ కార్డుల పై కార్పొరేట్ ఆసుపత్రిలో ఉచిత వైద్యం అందించాలి.
టియూడబ్లూ జే (ఐ జేయు) జిల్లా ఉపాధ్యక్షులు కొండ కింది మాధవరెడ్డి
డిమాండ్.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,నవంబర్ 7(జనం సాక్షి):
జర్నలిస్టులకు హెల్త్ కార్డులు అన్ని కార్పొరేట్ హాస్పిటల్ చెల్లుబాటు అయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నాగర్ కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షులు కొండ కింది మాధవరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన అన్ని కార్పొరేట్ ఆసుపత్రులలో ప్రభుత్వం జారీ చేసిన జర్నలిస్టులకు హెల్త్ కార్డు పై ఉచిత వైద్యం అందించాలని కోరారు.కొన్ని ఆసుపత్రులలో హెల్త్ కార్డులను పరిగణలోకి తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కావున వెంటనే స్పందించి ప్రభుత్వం అన్ని కార్పొరేట్ ఆసుపత్రులలో ఉచిత వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.