జర్నలిస్ట్ శ్రీనివాస్ కు నివాళులర్పించిన టియూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధానకార్యదర్శి విరహత్అలీ,
రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి
జగదేవ్ పూర్, అక్టోబర్ 14 (జనంసాక్షి):
రోడ్డు ప్రమాదంలో గురువారం రాత్రి ఆకస్మికంగా మృతి చెందిన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల ఆంధ్రజ్యోతి పాత్రికేయుడు, టీయూడబ్ల్యూజే క్రియాశీలక సభ్యుడు కొల్పుల శ్రీనివాస్ మృతదేహాన్ని గజ్వేల్ ప్రభుత్వాసుపత్రి మార్చురీలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టియూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె.విరహత్అలీ, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డిలతో పాటు పలువురు ప్రముఖులు వివిధ మండలాల విలేకరులు సందర్శించి నివాళలర్పించారు. ఈ సందర్భంగా ప్రజా పాత్రికేయుడు శ్రీనివాస్ అమర్ రహే అంటూ పాత్రికేయుల నినాదాలు మారుమ్రోగాయి. కార్యక్రమంలో గజ్వేల్ జర్నలిస్ట్స్ కాలనీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్నెల్లి సురేందర్, కె. మధుసూధన్ రెడ్డి, సీనియర్ పాత్రికేయులు వి.సత్యనారాయణ, పి.విజయనందరెడ్డి, సయ్యద్ జమీల్, పి. ఎల్లారెడ్డి, ఆర్.బాల్ నర్సయ్య, దాసరి కృష్ణ, డి.జగన్, రాయపోల్ శ్రీనివాస్, యాదగిరి, సతీష్, ఎల్.పరమేశ్వర్, సురేష్, మహేందర్ రెడ్డి, లక్ష్మీ నారాయణ, నాగం వెంకట్ రెడ్డి, దౌల్తాబాద్, రాయపోల్ మండలాలకు చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులతో పాటు ఆయా ప్రజా సంఘాలు, దళిత సంఘాల బాధ్యులు, పాత్రికేయులు పాల్గొన్నారు.
ప్రజా పాత్రికేయుడు శ్రీనివాస్
టియూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధానకార్యదర్శి విరహత్ అలీ
ప్రజా ఉద్యమాల నుండి పుట్టుకొచ్చిన ప్రజా పాత్రికేయుడు కొల్పుల శ్రీనివాస్ అని, అనేక పోరాటాల్లో క్రియాశీలకంగా భాగస్వామ్యమై ప్రజల పక్షపాతిగా నిలబడిన చరిత్ర శ్రీనివాస్ కు ఉందని టీయూడబ్ల్యూజే నేత విరాహత్ అలీ కొనియాడారు. వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమంలో శ్రీనివాస్ చురుకైన పాత్ర పోషించాడన్నారు. జర్నలిస్టు శ్రీనివాస్ కుటుంబానికి టియూడబ్ల్యూజే అండగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
Attachments area