Thursday, 5 November 2026

జర్నలిస్తుల సంక్షేమమే ద్యేయం :

ఐజేయు జాతీయ కార్యదర్శి నరేందర్ :శామీర్ పేట్, జనం సాక్షి :

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన జర్నలిస్టుల సంక్షేమం, హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయని, వీటి కోసం జర్నలిస్టు సంఘాలు పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని
టియుడబ్ల్యూజే ఐజేయు జాతీయ కార్యదర్శి నరేందర్ పేర్కొన్నారు. ఆత్మ అభిమానం నిలబెట్టుకుని జర్నలిస్టుల సంక్షేమం కొరకు పాటుపడుతున్న ఏకైక యూనియన్ టియుడబ్ల్యూజే ఐజేయు జర్నలిస్టుల సంఘమని రాష్ట్ర కార్యదర్శి విరహత్ అలి అన్నారు. బుధవారం మేడ్చల్ జిల్లా తుముకుంట మున్సిపాలిటీలో మొగుళ్ళ వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన టీయూడబ్ల్యూజే ఐజేయు మేడ్చల్ జిల్లా మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరై ఆయన ప్రసంగించారు.
ఈ కార్యక్రమానికి ఐజేయు జిల్లా అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బాలరాజు, జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మల్కయ్య, జర్నలిస్ట్ శంకర్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మరాటి రవి, రాష్ట్ర కోశాధికారి మహిపాల్ రెడ్డి, శామీర్ పేట, అల్వాల్ ప్రెస్ క్లబ్ సభ్యులు, జిల్లాలోని వివిధ మండలాల జర్నలిస్టులు, తదితరులు పాల్గొన్నారు.
14ఎస్పీటీ -1: సమావేశం లో మాట్లాడుతున్న నరేందర్