అక్కడ నుంచి నల్లగొండ జిల్లాలో నిర్మించే గంధంమల్ల రిజర్వాయర్‌కు గోదావరి జలాల్ని తరలిస్తారు. ఈ క్రమంలో ప్యాకేజీ`15 కింద 55వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. అదే మార్గంలో జలాల్ని ప్యాకేజీ`16 ద్వారా 11.39 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే బస్వాపూర్ రిజర్వాయర్‌లో పోస్తారు. తద్వారా ఈ ప్యాకేజీ కింద 1.88 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది. దీనితో పాటు ఆనకట్ట నుంచి ప్యాకేజీ`14 కింద 4.850 కిలోవిూటర్ల గ్రావిటీ కాల్వ, 8.950 కిలోవిూటర్ల టన్నెల్ నిర్మాణం ద్వారా జలాల్ని కొండపోచమ్మ రిజర్వాయర్ సవిూపంలో మెదక్ జిల్లా వర్గల్ మండలం పాములపర్తి వద్ద నిర్మించే పంపుహౌజ్ వరకు తరలిస్తారు. ఈ క్రమంలో ప్యాకేజీ`14 ద్వారా గ్రావిటీపైనే 2.27 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది. పాములపర్తి దగ్గర కూడా కేవలం 89 విూటర్ల మేర మాత్రమే లిఫ్టు ఉంది. ఇలా మొత్తంగా దాదాపు ఎనిమిది లక్షల ఎకరాలకు గ్రావిటీపై సాగునీరు అందించవచ్చు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు సామాన్య కార్యకర్తలా మారారు. మంత్రి హోదాను పక్కన పెట్టి సిద్దిపేట మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి తానే స్వయంగా బస్సుల్లో పార్టీ శ్రేణులను సీఎం కేసీఆర్ సభకు తరలించి కార్యకర్తలో జోష్‌ను నింపారు. మల్లన్న సాగర్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ సభకు మంత్రి దగ్గరుండి పార్టీ శ్రేణులను తరలించారు. మధ్యాహ్నం ముఖ్యమంత్రి సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ చేరుకున్నారు. అక్కడ నిర్మించిన పంపుహౌజ్‌ను పరిశీలించి మోటర్లు ఆన్ చేసారు. ఈ మోటార్ల ద్వారా మల్లన్నసాగర్‌లోకి దుంకుతున్న జలాలకు శాస్తోక్తర్రగా సారె సమర్పించారు. పూలు, పండ్లు, వస్త్రాలతో అభిషేకించారు.




