తొలుత కొమురవెల్లి మల్లన్నకు పూజలు
అనంతరం పూజలు నిర్వహించి ప్రారంభం
అంతా తానై కార్యక్రమంలో పాల్గొన్న హరీష్
సిద్దిపేట,ఫిబ్రవరి23(ఆర్‌ఎన్‌ఎ): సిద్దిపేట జిల్లాలో నిర్మించిన మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను సిఎం కెసిఆర్ రాష్ట్ర ప్రజలకు అంకితం చేసారు. తొలుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొమురవెల్లి మల్లన్నకు పూజలు చేశారు. మంత్రులు,ప్రజాప్రతినిధులు వెంటరాగా పూజలు నిర్వహించారు. అనంతరం
మల్లన్న సాగర్‌కు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా మల్లన్నసాగర్‌కు చేరుకున్నారు. మల్లన్న సాగర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మల్లన్నసాగర్ అతిపెద్ద రిజర్వాయర్. ఈ రిజర్వాయర్‌లో 50 టీఎంసీల నీటిని నిల్వచేసే సామర్థ్యం ఉంటుంది. ఈ రిజర్వాయర్ ద్వారా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకు తాగునీటిని సరఫరా చేయనున్నారు. అదేవిధంగా పారిశ్రామిక అవసరాలకోసం కొంత నీటిని వినియోగించనున్నారు. వీటితోపాటు ఆయకట్టుకు సాగునీటిని అందిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ జలాశయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. మల్లన్నసాగర్ జలాశయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా కొమురవెల్లి మల్లన్నకు కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్విచ్ఛాన్ చేసిన మల్లన్న సాగర్ రిజర్వాయర్‌లోకి సీఎం కేసీఆర్ నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొన్నారు. ఏరియల్ వ్యూ ద్వారా కేసీఆర్ ప్రాజెక్టును పరిశీలించారు. ముఖ్యంగా మల్లన్న సాగర్ తెలంగాణకు గుండెకాయ లాంటిది. మొత్తం ప్రాజెక్టులోనే అత్యధిక నీటి నిల్వ సామర్థ్యమున్న, అత్యంత ఎత్తున ఉన్న జలాశయం ఇదే. సిద్దిపేట జిల్లాలో 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ మహా జలాశయానికి 5 ఓటీ స్లూయిస్‌లు (తూములు) ఉన్నాయి. ఆ తూముల ద్వారానే కొండపోచమ్మ, గంధమల్ల రిజర్వాయర్‌కు, సింగూరు ప్రాజెక్టుకు, తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు, మిషన్ భగీరథకు నీటిని తరలిస్తారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ ఎఫ్‌ఆర్‌ఎల్ 535 విూటర్లు. అంటే చాలా ఎత్తులో ఉన్న ప్రదేశం. దీంతో మెదక్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాలకు కేవలం గ్రావిటీ ద్వారా జలాల్ని తరలించే వెసులుబాటు లభించనున్నది. మల్లన్నసాగర్ కింద 1.25 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. ప్యాకేజీ`13 కింద మల్లన్నసాగర్ నుంచి 8.733 కిలోవిూటర్ల మేర నిర్మించే గ్రావిటీ కాల్వ ద్వారా 53వేల ఎకరాలు సాగు కానున్నది. ప్యాకేజీ`17, 18, 19 కింద 11.670 కిలోవిూటర్ల గ్రావిటీ కాల్వ, 11.525 కిలోవిూటర్ల టన్నెల్ ఆపై మరో 2.505 గ్రావిటీ కాల్వ ద్వారా గోదావరి జలాల్ని హల్దీ నదిని దాటిస్తారు. అవసరమైతే అక్కడ నేరుగా హల్దీ నదిలోకి కూడా గోదావరిజలాల్ని పోసే వెసులుబాటు ఉంటుంది. ఆపై 34 కిలోవిూటర్ల గ్రావిటీ కాల్వ, 3.65 కిలోవిూటర్ల టన్నెల్ నిర్మాణంతో జలాలు మంజీరా నదిని దాటుతాయి. అక్కడి నుంచి 37.900 కిలోవిూటర్ల గ్రావిటీ కాల్వ ద్వారా సింగూరు రిజర్వాయర్ సవిూపంలోని ముదిమానిక్ తండా వద్ద నిర్మించే పంపుహౌజ్ వరకు తరలిస్తారు. ప్యాకేజీ`18 కింద 15వేల ఎకరాలు, ప్యాకేజీ`19 కింద 1.17 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది. మల్లన్నసాగర్ నుంచి 8.175 కిలోవిూటర్ల గ్రావిటీ కాల్వ ద్వారా 530 కాంటూర్ వద్ద నిర్మించే ఆనకట్ట దగ్గరకు గోదావరి




