జాతికి సన్మార్గం చూపిన మహోన్నత వ్యక్తి మహర్షి వాల్మీకి

 జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): రామాయణం వంటి మహా గ్రంథాన్ని మానవాళికి అందించిన గొప్ప మహోన్నతమైన వ్యక్తి ఆదికవి, మహర్షి వాల్మీకి అని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు.ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో  నిర్వహించిన మహర్షి వాల్మీకి జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.మహర్షి వాల్మీకి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రామాయణం స్పూర్తితో ప్రతిఒక్కరు మానవతా విలువలు పెంపొందించుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ అధికారి అనసూర్య , ఈఈ ఆర్అండ్ బి యాకుబ్, ఏఓ శ్రీదేవి, టీఎన్జీఓస్ జిల్లా కార్యదర్శి దున్న శ్యామ్, వివిధ శాఖల అధికారులు, సంఘ నాయకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.