– 24న తెలంగాణ మహానాడు
– టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ
హైదరాబాద్, మే22(జనం సాక్షి ) : ఈనెల 24న తెలంగాణ రాష్ట్ర మహానాడు నిర్వహిస్తామని టీటీడీపీ నేత ఎల్.రమణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ టిఆర్ఎస్ హావిూలు, రైతు ఆత్మహత్యలు, నిరుద్యోగ సమస్యలు, అసంపూర్తి ప్రాజెక్టులపై మహానాడులో తీర్మానాలు చేస్తామన్నారు. జాతీయ మహానాడులో ఐదు తీర్మానాలు ప్రవేశపెడుతామని రమణ తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడంలో టిఆర్ఎస్ ముందుందని ఆయన విమర్శించారు. కేసీఆర్ రోజుకో హావిూతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నాడని అన్నారు. ప్రస్తుతం ఎన్నికల సమయంలో లబ్ధిపొందుందుకు మాత్రమే కేసీఆర్ రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని, మళ్లీ త్వరలో రైతుల బీమా పథకాన్ని తెరపైకి తెచ్చేందుకు సిద్ధమవుతున్నారని అన్నారు. ఇవి కేవలంఎన్నికల స్టంట్లో భాగమేనని రమణ అన్నారు. కేసీఆర్ అమలు చేసిన రైతుబంధు పథకం కేవలం పెద్ద రైతులకే మేలు చేకూర్చిందని, చిన్న రైతులకు పెద్దగా ఒరిగిందేవిూ లేదన్నారు. డబ్బుమొత్తం ధనిక రైతులకిచ్చి రైతులను ఆదుకున్నామంటే సరిపోదని తెలిపారు. తప్పుడు పద్దతిలో పోయిన బీజేపీకి ప్రజాకోర్టులో శిక్షపడిందన్నారు. 2019లో టీడీపీ లేకుండా తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడదని మరో టీడీపీ నేత రావుల చంద్రశేఖర రెడ్డి అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం తప్పులు తడకని ఆయన విమర్శించారు.
జాతీయ మహానాడులో ఐదు తీర్మానాలు




