జాతీయ సమైక్యతా రక్షాబంధన్ ను జరిపిన మండల నాయకులు , అధికారులు
రుద్రూర్ (జనంసాక్షి):
అన్నా చెల్లెలి అనుబంధానికి ప్రతీకగా రక్షాబంధన్ వేడుకలను ప్రతి ఏటా ప్రతీ ఒక్కరూ ఘనంగా నిర్వహించుకుంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపిపి సుజాత నాగేందర్
రాఖీ పౌర్ణమి రోజున జాతీయ సమైక్యతా రక్షాబంధన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి.
మండలం కేంద్రంలోని ఆయా గ్రామాల మహిళా నాయకులు, మరియు మహిళా అధికారులు, ఐకెపి మహిళలు అందరూ ఒక దగ్గర చేరి తమకు అన్ని విధాలుగా సహాయం చేస్తు అన్నయ్యాలు గా , తమ్ముళ్లు గా ఉన్న జడ్పీటీసీ నారోజి గంగారాం , గ్రామ సర్పంచ్ ఇందూరు చంద్ర శేఖర్, మండల తహసిల్దార్ మూజీబ్, ఎంపీడీఓ బాల గంగాధర్, ఐకేపీ భాస్కర్ గారికి రాఖీలు కట్టి జాతీయ సమైక్యతా రక్షాబంధన్ ఘనంగా జరిపారు , ఈ సందర్భంగా వారు మాట్లాడుతూఎవరు చేపట్టని విధంగా వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టిన సోదరి, ఎంపీపీ అక్కపల్లి సుజాత నాగేందర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భారతీయ సంస్కృతిలో భాగమైన రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ మన సంస్కృతి సాంప్రదాయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని జడ్పిటిసీ నారోజి అన్నారు. తమకు అన్నయ్య అని గౌరవం ఇచ్చి రాఖీలు కట్టిన వారికి మండల నాయకులు, అధికారులు కలిసి బహుమానాలు, నగదును ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు, ఆయా శాఖల అధికారులు , నాయకులు తదితరులు ఉన్నారు