మువ్వన్నెలను ఇంటింటికి అద్దిన భారతీయ జనతా పార్టీ -హర్ గర్ తిరంగా లో భాగంగా భారీ తిరంగాబైక్ ర్యాలీ

 

మహబూబాబాద్ బ్యూరో-ఆగస్ట్12(జనంసాక్షి)

ఆజాదీ కా అమృత్ మహోత్సవ వేడుకలలో భాగంగా ఆగస్ట్ 13నుండి 15వరకు దేశంలో ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండాను ఎగరవేయలనే హర్ గర్ తిరంగా కార్యక్రమం మానుకోట జిల్లాలో దాదాపుగా పూర్తి స్థాయిలో విజయవంతమైందని మానుకోట జిల్లాలోని ప్రజలు జాతీయ జెండాను గుండెల్లో పెట్టుకున్నారని భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఝాటోట్ హుస్సేన్ నాయక్ అన్నారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు వద్దిరాజు రామచందర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ తిరంగాబైక్ ర్యాలీలో హుస్సేన్ నాయక్ ముఖ్యాతిధిగా పాల్గొని మాట్లాడుతూ భారత దేశ గౌరవాన్ని పెంచేందుకు ప్రతీ యువకుని దేశం పై ప్రేమను పెంచి బాధ్యతను గుర్తు చేసే గొప్ప పండుగగా హర్ గర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రధాని మోదీ అమలు చేశారన్నారు. ప్రతీ ఒక్కరిలో దేశభక్తిని పెంచే మువ్వన్నెల జెండాను ఇంటిపై ఎగరవేసుకుంటూ అనునిత్యం దేశం పట్ల గౌరవం, భక్తి, శ్రద్ధలు పెంచుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు వల్లపు వెంకటేశ్వర్లు, మెరెడ్డి సురేందర్, ఓర్సు పద్మావతి, సయ్యద్ రేష్మ, మండల అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్, పొదిళ్ళ నరసింహ రెడ్డి, మోతిలాల్ నాయక్, పసుపులేటి నవీన్, మోర్చాల అధ్యక్షులు సిరికొండ సంపత్, ధార ఇందూ భారతి, పట్టణ అధ్యక్షులు పల్లె సందీప్, వీరమల్ల ప్రేమ్ కుమార్, జల్లి ప్రశాంత్, మల్లం యశ్వంత్, వంగ కుమార్, మాలోత్ బాలు నాయక్, శ్రీకాంత్ నాయక్, నరేష్ నాయక్, మాలిక్ చౌహన్, తరంజిత్ రెడ్డి, వివిధ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువకులు పెద్దమొత్తంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు