హైదరాబాద్: జార్ఖండ్ గవర్నర్ గా ద్రౌపది ముర్ము నేడు ప్రమాణ స్వీకారం చేశారు. జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వీరేంద్ర సింగ్ ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్ర సీఎం, మాజీ సీఎంలు శిబుసోరెన్, అర్జుణ్ ముండా, పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ద్రౌపది ముర్ము గతంలో ఒడిశాలో బిజెపి తరపున రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేశారు.




