జిన్నాగా వస్తోన్న మంచు విష్ణు

హిట్లు,ప్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న మంచు విష్ణు తాజా చిత్రం జిన్నాతో వస్తున్నాడు. ఢీ, దూసుకెళ్తా, దేనికైనారెడి వంటి సినిమాలు విష్ణుకు కమర్షియల్‌ హీరోగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. అయితే విష్ణు నటించిన గత ఐదారు సినిమాలు కనీస స్థాయిలో కూడా కలెక్షన్లు రాబట్టలేకపోయాయి. ఇక ప్రస్తుతం నటిస్తున్న చిత్రం జిన్నా. ఇషాన్‌ సూర్య ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో మంచి అంచనాలే ఉన్నాయి. సన్నిలియోన్‌, రాజ్‌పుత్‌పాయల్‌ ఈ సినిమాలో భాగమవడంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి. తాజాగా విష్ణు ఫస్ట్‌లుక్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. విష్ణు కెరీర్‌లో ఇప్పటివరకూ చేయని సరికొత్త పాత్రలో నటించనట్లు ఫస్ట్‌లుక్‌ గ్లింప్స్‌ చూస్తుంటే తెలుస్తుంది. ఈ చిత్రంలో విష్ణు గాలి నాగేశ్వరరావు పాత్రలో నటిస్తున్నాడు. ప్రముఖ రచయిత, నిర్మాత కోనవెంకట్‌ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు క్రీయేటీవ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు.