జిపి కార్మికులను పర్మినెంట్ చేయాలని
పెన్ పహాడ్, జూలై 24 (జనం సాక్షి) : జిపి కార్మికులను పర్మినెంట్ చేయాలని జిపి కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షులు ధనియాకుల శ్రీనివాస్ మండల అధ్యక్షులు ప్రభుత్వాన్ని కోరారు, సోమవారం మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద 19వ రోజు గ్రామపంచాయతీ కార్మికులు మోకాళ్లపై నిరసన కార్యక్రమం వ్యక్తం చేశారు, ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ధనియాకుల శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రణపంగా వెంకన్న, కార్యదర్శి నరసయ్య, విజయ్ కుమార్, గోపయ్య హుస్సేన్ వెంకటయ్య సతీష్ వెంకన్న శౌరి, ప్రమీల, నాగయ్య, శ్యాంసుందర్, శీను ఎర్రమల్ల శ్రీనివాస్, సైదులు, రమేష్, సోమయ్య, వీరస్వామి, తదితరులు పాల్గొన్నారు