ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

తెలంగాణ విగ్రహం వద్ద కేక్ కట్ చేస్తున్న జడ్పిటిసి మామిడి అనిత అంజయ్య
పెన్ పహాడ్, జూలై 24 (జనం సాక్షి ) : తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి,బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను పెన్ పహాడ్ మండల కేంద్రంలోని జెడ్పీటసీ మామిడి అనిత అంజయ్య, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దోంగరి యుగంధర్, ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు,ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐటీ శాఖ మంత్రిగా ఉంటూ ప్రపంచ దేశాలలో తెలంగాణ రాష్ట్రాన్ని నిలిపిన ఘనత కేసిఆర్ కే దక్కుతుందని కొనియాడారు. ప్రభుత్వ పాలనతో పాటు పార్టీ బాధ్యత చేపట్టి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కేటీఆర్ ప్రణాళికలు రూపొందిస్తున్నారని అన్నారు, ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు సభ్యులు షేక్ రఫీ, కొండమీది గోవిందరావు, ఊరుకొండ రాధాకృష్ణ, ఒగ్గు గోపి, దాసరి శ్రీనివాస్, పొదిల నాగార్జున, దంతాల వెంకన్న, ఆవుల అంజయ్య, రాయల శ్రీనివాస్, ఒగ్గు కిరణ్, గూడపూరి రవి, లక్ష్మణ్, రవి, రమేష్, కొండ జానకి రాములు, తదితరులు పాల్గొన్నారు…