జిపి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

గుడిహత్నూర్: జూలై 8 (జనం సాక్షి) పంచాయితీలలో పని చేస్తున్న కార్మికుల సమ స్యలు పరిష్కరించాలని ఏఐసిసి సభ్యడు నరేష్ జాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిపి కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు శనివారం మూడో రోజుకు చేరుకున్నాయి ఈ దీక్ష శిబిరాన్ని నరేష్ జాదవ్ సందర్శించి సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు నీటి మూతలయ్యాయన్నారు కార్మికులకు వేతనాలు పెంచడంతో పాటు ఆరోగ్యం పట్ల అన్ని వసతులు కల్పించాలన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రేస్ పార్టీ మండల అధ్యక్షుడు మాల్యాల కరుణాకర్, ఏఎంసి మాజీ వైస్ ఛైర్మన్ నాగథప్పా, నాయకులు అరిఫ్ ఖాన్, షేక్ సలీమ్, హైమద్ ఖాన్, గణేష్ రమేష్, కృష్ణ తదితరులు ఉన్నారు

తాజావార్తలు