*జిల్లాకు అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్,అర్.డి. ఓ.జగదీశ్వర్ రెడ్డి అందించిన సేవలు అభినందనీయం*
బదిలీ పై వెళుతున్న అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్,అర్.డి. ఓ.జగదీశ్వర్ రెడ్డి లకు జిల్లా యంత్రాంగం తరపున ఆత్మీయ వీడ్కోలు
నల్గొండ బ్యూరో. జనం సాక్షి ఆగస్ట్ 10, :
నల్గొండ జిల్లాకు అదనపు కలెక్టర్ గా వి.చంద్ర శేఖర్ ,అర్.డి. ఓ.గా జగదీశ్వర్ రెడ్డి జిల్లాకు అందించిన సేవలు అభినందనీయమని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు.అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్,అర్.డి. ఓ.జగదీశ్వర్ రెడ్డి లు బదిలీ పై వెళుతున్న సందర్భంగా జిల్లా యంత్రాంగం తరపున జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ జిల్లా లో పరిపాలనా పరంగా అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయటం లో వారి పాత్ర ఎంతో కీలకమైందని అన్నారు. గ్రామీణ స్థాయి నుండి ప్రజలతో,అధికారులతో సామరస్యం గా మమేకమై స్నేహ పూర్వకంగా వుంటూ ఎన్నో కార్యక్రమాలను విజయవంతం చేసి జిల్లా ను అభివృద్ధి పథం లో నిలిపారని అన్నారు.అదనపు కలెక్టర్ గా ,అర్.డి. ఓ గా రెవెన్యూ ఇతర సమస్యలను పరిష్కరించి మంచి అధికారులుగా పేరు తెచ్చుకున్నారని అన్నారు.జిల్లా అధికారులు,వివిధ ఉద్యోగ సంఘాల నేతలు,రైస్ మిల్లర్లు మాట్లాడుతూ జిల్లాకు వారు అందించిన సేవలు మరువలేనివి కొనియాడారు. ప్రజా సమస్యలపై సంబంధిత శాఖల అధికారులను సమన్వయం చేస్తూ పరిష్కరించారని అన్నారు.జిల్లా అధికారులు,ప్రజలు వారి సేవలు గుర్తించు కుంటారని అన్నారు.బదిలీ పై వెళుతున్న అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్,అర్.డి. ఓ జగదీశ్వర్ రెడ్డి లు మాట్లాడుతూ నల్గొండ జిల్లాను మరిచిపోమని, జిల్లాలోని అధికార యంత్రాంగం తన విధి నిర్వహణలో పూర్తి స్థాయిలో సహకారం అందించారని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో అర్.డి. ఓ లు రోహిత్ సింగ్,జగన్నాథ రావు,నోవా అధ్యక్షులు రాజ్ కుమార్,టి జి . ఓ.అధ్యక్షులు ముజీ బుద్దిన్,టి. యన్.జి. ఓ.అధ్యక్షులు శ్రావణ్ కుమార్, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.అనంతరం వారిని ఘనంగా సన్మానించారు.