జిల్లాను పచ్చని తివాచిగా మార్చేందుకు ప్రత్యేక కృషి

పార్కుల సుందరీకరణకు అధిక ప్రాధాన్యత

చెట్లు ప్రగతికి మెట్లు

– రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):సూర్యాపేట జిల్లాను పచ్చని తివాచిగా మార్చేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.ఆదివారం జిల్లాలో స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలలో భాగంగా వనమహోత్సవ కార్యక్రమంలో చివ్వేంల మండలం ఉండ్రుగొండలో అటవీ శాఖ అర్బన్ పార్కును ప్రారంభించారు.అనంతరం జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ , మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణలతో కలిసి మొక్కలను నాటారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో పట్టణ ప్రగతి కింద 144 పార్కులు , పల్లె ప్రగతి కింద 679 పార్కులను చేపట్టినట్లు తెలిపారు.పట్టణాలకు పోటీగా పల్లెలలో గణనీయమైన అభివృద్ధి జరుగుతుందన్నారు.పార్కుల సుందరీకరణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు.పార్కులలో పండ్లలు, పూలు, అటవి జాతి మొక్కలను నాటడం జరిగిందని, అలాగే ప్రతి పార్కులో కూడా అన్ని వసతులు కల్పించామని అన్నారు.చెట్లు ప్రగతికి మెట్లని ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాలను జిల్లాలో షెడ్యూల్ ప్రకారం జిల్లా అంతటా ఘనంగా కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు.ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, ఎంపీపీ కుమారి బాలునాయక్ , జడ్పీటిసి సంజీవ్ నాయక్ , ఆర్డిఓ రాజేంద్ర కుమార్ , డిఎఫ్ఓ ముకుందా రెడ్డి, జడ్పీ సిఈఓ సురేష్ , పిడి కిరణ్ కుమార్, డిపిఓ యాదయ్య , వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.