జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):పటిష్టమైన పోలీసు బందోబస్త్ , ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది.జిల్లాలో మొత్తం 23,571 మంది అభ్యర్థులకు గాను 22,175 మంది హాజరయ్యారు.1376 మంది గైర్హాజరయ్యారు.సూర్యాపేట పట్టణంలోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల,60 ఫీట్లు రోడ్ లో గల పరీక్ష కేంద్రాలను ఎస్పీ పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షను ప్రశాంత నిర్వహించామని అన్నారు.పోలీస్ జిల్లా నోడల్ అధికారి డిఎస్పీ నాగభూషణం, రీజినల్ కో ఆర్డినేటర్,  చీప్ సూపర్డెంట్లు, అబ్జర్వర్లు, ఇన్విజిలేటర్లు, బయోమెట్రిక్ అధికారులు సిబ్బంది, పోలీస్ అధికారులు, సిబ్బందిని అభినందించారు.రాష్ట్ర పోలీస్ అధ్వర్యంలో పారదర్శకతతో నియామకాలు జరపబడుతాయని పేర్కొన్నారు.అభ్యర్థులు ఎలాంటి ప్రలోభాలకు గురి కావద్దని,డబ్బులు కడితే ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే బ్రోకర్లు మాటలు నమ్మవద్దని, మోసపోవద్దని సూచించారు.ఇలాంటి వారు వారైనా తారసపడితే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని కోరారు.