జిల్లా ఎస్పీపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి

– బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): పట్టణంలో శుక్రవారం జరిగిన జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా బాధ్యత గల జిల్లా అధికారిగా ఉన్న ఎస్పీ మంత్రికి జేజేలు కొట్టడం,  ప్రజలందరి చేత జై కొట్టించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు శుక్రవారం ఓ ప్రకటనలో అన్నారు.మంత్రి అనుచరునిలా నినాదాలు ఇవ్వడం సరైన విధానం కాదని పేర్కొన్నారు.ఒక పార్టీ కార్యకర్త మాదిరిగా వ్యవహరించడమనేది ప్రజలు , ప్రజాస్వామ్యవాదులు హర్షించరని , ఇక సామాన్య  ప్రజలకు ఎలా న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు.ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఎస్పీపై చర్యలు తీసుకోవాలన్నారు.
Attachments area