జిల్లా ఏర్పాటు ఉద్యమానికి మద్దతు పలకాలి:- జిల్లా సాధన సమితి
మిర్యాలగూడ. జనం సాక్షి.
మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు ఉద్యమానికి మద్దతు పలకాలని జిల్లా సాధన సమితి దామరచర్ల ఎంపీపీ ధీరావత్ నందిని రవితేజను కోరారు. శుక్రవారం మిర్యాలగూడ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో మిర్యాలగూడను జిల్లా చేయాలని కోరుతూ దామరచర్ల మండల సమావేశంలో తీర్మానం చేయాలని కోరారు. దాంతోపాటు జిల్లా సాధన కోసం జరుగుతున్న ఉద్యమంలో పాల్గొనాలని సమితి నేతలు కోరినట్లు తెలిపారు. జిల్లా ఏర్పాటు కోసం తన వంతు కృషి చేస్తానని, మండల సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ సలహాదారుడు ధీరావత్ రవితేజ నాయక్,జిల్లా సాధన సమితి సభ్యులు బంజారా ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు మాలోతు దశరధ నాయక్, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు తాళ్లపల్లి రవి, ఎంపీటీసీల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జం సాయి,బీసీ సంఘం పట్టణ అధ్యక్షుడు బంటు వెంకటేశ్వర్ల,యాదవ సంఘం డివిజన్ ప్రధాన కార్యదర్శి చేగొండి మురళి యాదవ్, సామాజికవేత్త సరికొండ రిషికేశ్వర్ రాజు, డాక్టర్ జాడి రాజు దాసరాజు జయరాజు నాగేష్ తదితరులు పాల్గొన్నారు