జిల్లా ఏర్పాటు చేయాలని ఆర్డీవో వినతి:-
మిర్యాలగూడ. జనం సాక్షి
మిర్యాలగూడను జిల్లా కేంద్రం చేయాలని, ప్రజల ఆకాంక్ష ప్రభుత్వానికి తెలియజేసేలా నివేదించాలని కోరుతూ మిర్యాలగూడ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో శనివారం ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా సాధన సమితి సభ్యులు మాట్లాడుతూ జిల్లా ఏర్పాటుకు అవసరమైన అన్ని రకాల అవకాశాలు, వనరులు, భౌగోళిక స్వరూపం మిర్యాలగూడలో ఉన్నదని జిల్లాగా ప్రకటించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. వినతి పత్రం సమర్పించిన వారిలో సాధన సమితి నాయకులు మాలోతు దశరధ నాయక్ తాళ్లపల్లి రవి, రిషికేశ్వరరాజు, బంటు వెంకటేశ్వర్లు జయరాజు మురళి యాదవ్ దుర్గయ్య ఫారూక్ సుధాకర్ నాగేష్ తదితరులు పాల్గొన్నారు.