యువకున్ని మృతితో అంబాలాపూర్ లో విషాదం

జనం సాక్షి, శంకరపట్నం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం అంబాల పూర్ కు చెందిన ముంజ హరీష్ మృతదేహం శనివారం సొంత గ్రామానికి చేరుకుంది దీంతో గ్రామములో విషాదఛాయలు అలుముకున్నాయి పెద్దపెల్లి జిల్లా కమాన్పూర్ మండలంలో ఈనెల 26న ముంజ హరీష్ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం పాఠకులకు విధితమే ఉద్యోగ ఒప్పిస్తానని ఏడు లక్షల రూపాయలు తీసుకొని మోసం చేసిన సంఘటనలో హరీష్ ఈ అఘ్త్యానికి పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు ఆత్మహత్య గల కారణాలను సోషల్ మీడియాలో మృతుడు పోస్ట్ పెట్టడంతో సంచలనం రేపింది రామగుండం ఎరువుల కర్మాగారం ఆర్ ఎఫ్ సి ఎల్ లో ఉద్యోగం కోసం మేక క్రాంతి కుమార్ అనే వ్యక్తి ద్వారా బ్రోకర్ కు 7 లక్షల రూపాయల చెల్లించినట్లు మృతుడు సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ వ్యవహారం బయటపడింది హరీష్ మృతి కారణమైన వ్యక్తులపై ప్రత్యేక చర్యలు తీసుకొని న్యాయం చేయాలని మృతులు కుటుంబ సభ్యులు ఆరోపించారు.