జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య చేతుల మీదుగా ఆయుష్ ఆరోగ్య కరదీపిక పుస్తకం ఆవిష్కరణ.
ములుగు జిల్లా బ్యూరో, జూలై 26( జనంసాక్షి):- ఈ రోజు ఆయుష్ డిపార్ట్మెంట్ ములుగు జిల్లా వారి ఆధ్వర్యంలో ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయుష్ విభాగం, వైద్య ఆరోగ్య శాఖ తెలంగాణ ప్రభుత్వం వారు ముద్రించిన ఆయుష్ ఆరోగ్య కరదీపిక పుస్తకం ను జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ ఆదిత్య చేతుల మీదుగా పుస్తక ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆయుష్ నోడల్ ఆఫీసర్ డా.సారంగ పాణి, డిప్యూటీ నోడల్ ఆఫీసర్ డా. మహబూబ్ పాషా, సిబ్బంది పాషా , సతీష్ పాల్గొన్నారు.