జిల్లా రజక, నాయీ బ్రాహ్మణ సంక్షేమ కమిటీల ఎన్నిక

 వికారాబాద్ జిల్లా బ్యూరో జనం సాక్షి జూలై 29
జిల్లాలోని రజక, నాయీ బ్రాహ్మణ సంక్షేమం కోసం జిల్లా స్థాయి రజక మరియు నాయీ బ్రాహ్మణ సంక్షేమ కమిటీలను జిల్లా కలెక్టర్ గారి ఆమోదం ద్వారా  ఏర్పాటు చేయటం జరిగిందని జిల్లా బి సి సంక్షేమ అధికారి కే.ఉపేందర్ శుక్రవారం తెలిపారు. ఈ కమిటి లకు జిల్లా కలెక్టర్ చైర్మన్ గా ఉంటారని తెలిపారు. రజక కులానికి చెందిన నలుగురు కమిటి  సభ్యులు  చాకలి  రాములు, పెద్దలాల్ ఆంజనేయులు, పెద్దేముల్ క్రిష్ణ, చాకలి సుశీల, అదే విధంగా నాయీ బ్రాహ్మణ కులానికి చెందిన నలుగురు కమిటి సభ్యులు యం.రమేశ్  యం.నాగలక్ష్మి, యం.హనుమంతు, యం. విజయ కుమార్ లు ఎంపిక అయినారన్నారు.  వీరికి జిల్లా బి సి సంక్షేమ అధికారి కే.ఉపేందర్ గారు  దృవీకరణ పత్రాలను అందచేయడం జర్గింది.

తాజావార్తలు