జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

మల్దకల్ సెప్టెంబర్ 19 (జనంసాక్షి)జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలైన అమరవాయి కాంప్లెక్స్ లోని ప్రాథమిక పాఠశాల పాల్వాయి ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ ఎం కుసుమలత, యుపిఎస్ మేకలసోంపల్లి ప్రధానోపాధ్యాయుడు మల్లికార్జున్,అమరవాయి కాంప్లెక్స్ ఆధ్వర్యంలో మంగంపేట ప్రాథమిక పాఠశాలలో ఇరువురికి అమరవాయి కాంప్లెక్స్ హెచ్ఎం జానకమ్మ ఉపాధ్యాయులు కలిసిపూలమాల శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం భాస్కర్, ఉపాధ్యాయుడు గోపాలు తదితరులు పాల్గొన్నారు.