డబ్బుల కోసం కిరాతకుడైన తనయుడు
ఇనుపరాడ్‌తో తండ్రి హత్య
హైదరాబాద్,నవంబర్12(జనంసాక్షి): మానవత్వానికి మాయతెచ్చేలా ఓ ప్రబుద్దుడు కన్నతండ్రినే కర్కషంగా చంపేశాడు. పెన్షన్ డబ్బులు ఇమ్మని అడిగి ఇవ్వనందుకు ఈ రకంగా కక్ష తీర్చుకున్నాడు. రిటైర్మెంట్ సొమ్ము కోసం కన్న తండ్రినే హత్య చేశాడు కశాయి కొడుకు. విూర్‌పేట్ లిమిట్స్ జిల్లెలగూడలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న మేడిపల్లి కృష్ణ(58) ఇటీవలే వాటర్ వర్క్ డిపార్ట్‌మెంట్ నుంచి రిటైర్మెంట్ అయ్యారు. రిటైర్మెంట్ సందర్భంగా వచ్చిన డబ్బు విషయంలో కృష్ణకు ఆయన కుమారుడు తరుణ్‌కు మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ క్రమంలో రెచ్చిపోయిన తరుణ్ గత రాత్రి ఇనుపరాడ్‌తో మోది తండ్రిని హత్య చేశాడు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. విషయం తెలిసిన కుటుంబసభ్యులు వెంటనే కృష్ణను ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.




