Thursday, 5 November 2026

శ్రీశైలంలో కార్తీక సందడి

శ్రీశైలం,నవంబర్‌12(జ‌నంసాక్షి): కార్తీకమాసం తొలి సోమవారం కావడంతో ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం భక్త జనంతో నిండిపోయింది. పరమ శివుడికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసం కావును భక్తులు శ్రీగిరికి తరలివచ్చి మల్లన్నను దర్శించుకుంటున్నారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి ఆలయానికి చేరుకున్నారు. స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. కార్తీక తొలి సోమవారం కావడంతో భక్తుల రద్దీ కొనసాగుతుందని ఆలయ అధికారులు తెలిపారు. నాగుల చవితి సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని నాగదేవత విగ్రహాలకు ఆదివారం భక్తులు పాలాభిషేకం చేసి పూజలు చేశారు. సోమవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు కొనసాగాయి. కార్తిక మాసం తొలి సోమవారంతో సందర్భంగా తరలివచ్చిన పర్యాటకులు, భక్తులతో సూర్యలంక తీరంలో సందడి వాతావరణం ఏర్పడింది. సముద్రంలో పుణ్య స్నానాలు చేసి సైకత శివలింగాలకు మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సవిూపంలోని అటవీ శాఖ తోటల్లో సామూహికంగా భోజనాలు చేశారు. తీరంలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బాపట్ల గ్రావిూణ ఎస్సై రవికృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు. పర్యాటకులతో బీచ్‌ కిక్కిరిసిపోయింది. డీఎస్పీ గంగాధరం బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించారు.