ఎల్బీ నగర్( జనం సాక్షి )గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని వారి ఆఫీసులో బి.యన్ రెడ్డి నగర్ మాజీ కార్పొరేటర్ శ్రీమతి ముద్దగౌని లక్ష్మీప్రసన్న రామ్మోహన్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గం,హయత్ నగర్ డివిజన్ పరిధిలోని భూలక్ష్మీ నగర్ కాలనీలో మహిళా బిల్డింగ్ నిర్మాణం కొరకు మరియు బి ఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని గాయత్రి బ్యాంక్ కాలనీ లో భూగర్భ డ్రైనేజీ సమస్య పరిష్కారానికై జిహెచ్ఎంసి మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి కి వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన మేయర్ వీలైనంత త్వరగా సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మేయర్ ను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంలో గాయత్రి బ్యాంక్ కాలనీ అధ్యక్షురాలు సరస్వతి, భూ లక్ష్మీ నగర్ కాలనీ అధ్యక్షురాలు విజయ, కాలనీవాసులు పుష్ప, పద్మ దామోదర్ రెడ్డి, విజయలక్ష్మి, యుగల, రాజ్యలక్ష్మి, దామోదర్ రెడ్డి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
జిహెచ్ఎంసి మేయర్ ను కలిసిన : ముద్దగౌని లక్ష్మీప్రసన్న రామ్మోహన్ గౌడ్




