Wednesday, 4 November 2026

జి.ఎస్.ఆర్ ఫౌండేషన్ కు చిన్నారుల ఆర్థిక సహాయం

క్యాతన్ పల్లి మున్సిపాలిటీ రామకృష్ణాపూర్ కు చెందినసింగరేణి ఉద్యోగస్థుడు ఆకనపల్లి సురేష్ పిల్లలు ఉదారత చాటారు. చిన్నారులు శర్మిష్ఠ అషత్ ,నిర్విఘ్న తమ పుట్టినరోజు వేడుకలకై దాచుకున్న కిడ్డీ బ్యాంక్ డబ్బులు జి ఎస్ ఆర్ ఫౌండేషన్ కు విరాళంగా అందజేశారు. డాక్టర్ రాజా రమేష్ బృందం ఆధ్వర్యంలో మంచిర్యాలలోని ఎన్టీఆర్ నగర్ లో అన్నదానం, బట్టలు, బెడ్ షీట్లు గత వారం రోజులుగా నిరాశ్యులైన వారికి దాతల సహాయ సహాకారాలతో జీ.ఎస్.ఆర్. ఫౌండేషన్ వారు సేవ చేస్తున్నందుకు తమ వంతుగా దాచుకున్న డబ్బులు విరాళంగా శనివారం అందజేశారు. జి ఎస్ ఆర్ ఫౌండేషన్ వారు చేస్తున్న సేవలను సోషల్ మీడియా ద్వారా చూసి తమ వంతుగా సహాయం చేయాలని ఆలోచన కలిగి కలిగినట్లు వారు తెలిపారు. మా నాన్నగారి సహాయంతో జి ఎస్ ఆర్ ఫౌండేషన్ వారికి మేము దాచుకున్న డబ్బులను ఇవ్వడం జరిగిందన్నారు. అనంతరం చక్కని స్పూర్తితో ఉదారత చాటిన చిన్నారులనుఫౌండేషన్ నిర్వాహకులతో పాటు పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో జి ఎస్ ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ రాజా రమేష్, డాక్టర్ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.