కుత్బుల్లాపూర్ (జనంసాక్షి) : ఇద్దరు ఆటో డ్రైవర్లు ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. కుత్బుల్లాపూర్ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్లు శ్రీకాంత్(30), సురేష్(28) అన్నదమ్ములు. బ్యూటీ పార్లర్ నిర్వహించే ఓమహిళ మంగళవారం సాయంత్రం వీరి ఆటో ఎక్కింది. ఆటోను దారి మళ్లించిన నిందితులు జీడిమెట్ల సమీపంలోని హెచ్‌ఎమ్‌టీ కంపెనీ అటవీ ప్రాంతానికి మహిళను తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం నిందితులిద్దరూ పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




