Wednesday, 4 November 2026

జీడిమెట్ల పరిసరాల్లో నిర్బంధ తనిఖీలు

హైదరాబాద్‌,అక్టోబర్‌15(జ‌నంసాక్షి): మేడ్చల్‌ జిల్లా జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని భగత్‌ సింగ్‌ నగర్‌లో సోమవారం ఉదయం పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. డిసిపి పద్మజ, ఎసిపి గోవర్ధన్‌ ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు కొనసాగుతున్నాయి. సరైన పత్రాలు లేని 35 ద్విచక్రవాహనాలు, ఏడు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. 12 మంది అనుమానితులను అరెస్టు చేశారు. పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గుర్తింపు పత్రాలు లేని గ్యాస్‌ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.