హైదరాబాద్: జీవో 123పై తీర్పును హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. జీవో 123ను హైకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తన వాదనలు వినిపించింది. షెడ్యూల్ 2 ప్రకారం రైతులు, రైతు కూలీలకు న్యాయం చేస్తామని హైకోర్టుకు ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు. వాదనలు విన్న కోర్టు జీవోపై విధివిధానాలు రూపొందించుకుని రావాలని ప్రభుత్వానికి సూచించింది




