ప్రధాని
మోదీ రాష్ట్ర పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఈనెల 7న ప్రధాని చేతుల మీదుగా 5 శంకుస్థాపన కార్యక్రమాలు ఉటాయని వివరించారు. ప్రధాని కూర్చునే వేదికపై 18మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశామన్నారు. వీఐపీ, వీవీఐపీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ప్రధాని పాల్గొనే బహిరంగ సభలో 2లక్షల మంది కూర్చునేలా, వాహనాల పార్కింగ్ కోసం 4 అప్రోచ్ రోడ్లు, సుమారు 200 తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశామన్నారు. జనరేటర్లు, అగ్నిమాపక యంత్రాలు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
మోదీ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి : హరీశ్‌రావు




