Tuesday, 3 November 2026

జీహెచ్ఎంసీలో అవినీతి తిమింగలం..

హైదరాబాద్ : హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ అధికారి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సర్కిల్-18 లో సెక్షన్ ఆఫీసర్ జనార్ధన్ మహేష్‌కు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలు రావడంతో ఏసీబీ దాడులు చేపట్టింది. నగరంలోని పలు చోట్ల ఉన్న ఆయన ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. సఫీల్‌గూడ, ఆర్‌కేపురం, లాలాగూడలోని ఇళ్లలో ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నాయి.  ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని ఆరోపణలున్నాయి. సఫీల్ గూడా, ఆర్కేపురం, లాలాగూడలోని నివాసాలపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. ఈ సోదాల్లో భారీగా ఆస్తులు లభ్యమైనట్లు సమాచారం. అధికారిక సమాచారం ప్రకారం రూ. 6-10 కోట్ల ఆస్తులు బయటపడినట్లు తెలుస్తోంది. కానీ బహిరంగ మార్కెట్లో ఈ ఆస్తుల విలువ రూ. 20-30 కోట్లు ఉంటుందని అంచనా. ఇప్పటి వరకు రూ.3 లక్షల నగదు..రెండు కార్లు..నాలుగు భవంతులున్నట్లు అధికారులు గుర్తించారు. అనుమతులిచ్చే సమయంలో అధికారి మహేష్ అవినీతికి పాల్పడినట్లు ఏసీబీ భావిస్తోంది. ఈ సోదాలు మధ్యాహ్నం వరకు కొనసాగే అవకాశం ఉంది. సోదాలు ముగిసిన అనంతరం ఎంత అవినీతికి పాల్పడిందనేది తెలుస్తుంద

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *