హైదరాబాద్: తమ సమస్యల పరిష్కారం కోరుతూ జీహెచ్‌ఎంసీ కార్మికులు చేపట్టిన 108 రోజుల రిలే దీక్షలను తెరాస ఎమ్మెల్యే హరీశ్‌రావు ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ బడ్జెట్ సమావేశాల్లోగా సమస్యలు పరిష్కరించకపోతే కార్మికులతో కలిసి శాసనసభను ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.




